Site icon HashtagU Telugu

Telangana : జాగ్రత్త..ప్రజాపాలన పేరుతో ఫోన్ కాల్స్..క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం

Cyber Criminals Phone Cal

Cyber Criminals Phone Cal

ఇటీవల సైబర్ నేరగాళ్లు (Cyber ​​Criminals) రెచ్చిపోతున్నారు. ఫోన్ కాల్స్ చేసి ఓటీపీ (OTP)చెప్పమని చెప్పి క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రజా పాలన (Praja Palana) పేరు చెప్పి ఫోన్లు చేయడం..ఓటీపీ లు అడిగి డబ్బులు కొట్టేయడం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party).. ప్రజల వద్దకు పాలనే పేరుతో ఆరు గ్యారంటీల (Congress Six Guarantee Schemes) అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజా పాలన పేరుతో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించింది. దీనికి ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి ప్రజా పాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా అభ్యర్థులకు ప్రభుత్వ పథకాలు అందజేయబోతుంది. దాదాపు కోటి 30 లక్షలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అందజేశారు. ఈ దరఖాస్తులో ఆధార్ కార్డు తో పాటు ఫోన్ నెంబర్లు తదితర వివరాలు పొందుపరిచారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఫోన్ నెంబర్ల ఆధారంగా ఫోన్ లు చేసి ప్రజా పాలన కు సంబంధించి ఫోన్ చేస్తున్నామని చెప్పి..సదర్ వ్యక్తి వివరాలు , బ్యాంకు అకౌంట్ డీటైల్స్ , ఓటీపీ లు అడిగి బ్యాంకు ఖాతాలో నుండి డబ్బులు కొట్టేస్తున్నారు. గత వారం రోజులుగా ఇలాంటి ఘటనలు తెలంగాణాలో ఎక్కువుతున్నాయి.

లబ్దిదారుల ఫోన్‌లకు వచ్చే ఓటీపీలు ఎవరికి చెప్ప వద్దని డబ్బులు పోగొట్టుకోవద్దు అంటూ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈమేరకు పోలీసులు పోస్టర్‌‌ను విడుదల చేస్తూ కింది సూచనలు చేశారు. వాస్తవానికి దరఖాస్తుదారులకు ప్రభుత్వ నుంచి ఎలాంటి ఓటీపీలు రావని.. ఫేక్‌ మెసేజ్‌లని ఓపెన్‌ చేయకూడదని హెచ్చరించారు. త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తుందని దానిలో దరఖాస్తు స్థితి తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులమని, ఖాతా అప్‌డేట్‌ చేస్తామని, ఆరు గ్యారంటీలు కావాలంటే మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీలను చెప్పమంటే వాటిని తిరస్కరించాలని వివరించారు.

Read Also : Amazon Great Republic Day Sale: జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. వీటిపై భారీ ఆఫర్లు..!