Site icon HashtagU Telugu

CWC Meeting in Telangana : సీడబ్ల్యూసీ సమావేశంలో ఐదు కీలక అంశాలఫై చర్చ…

Cwc Meeting Update

Cwc Meeting Update

హైదరాబాద్ లో మరికాసేపట్లో సీడబ్ల్యూసీ (CWC meeting in Telangana) సమావేశాలు మొదలుకాబోతున్నాయి. తాజ్ కృష్ణ లో జరగనున్న ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా (sonia ) , రాహుల్ (rahul ) , ప్రియాంక ( Priyanka), ఖర్గే, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్‌ చెన్నితాల, కొడుక్కునిల్‌ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్‌ సింగ్‌ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్‌ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్‌ తివారీ, గౌరవ్‌ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా పాల్గొననున్నారు. అలాగే సీడబ్ల్యూసీ సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పులరాజుతోపాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహా, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల హోదాల్లో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

ఇక ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇందులో మొదటిది త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం. 2. భారత్ జోడో యాత్ర నిర్వహణ 3. 2024 లోక్ సభ ఎన్నికలు 4. ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు 5. ఈనెల 18 నుంచి ప్రారంభం అవనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిల మీద కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. ఇవి కాకుండా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టాల్సిన పోరాటాలు వంటి విషయాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక సాధారణంగా ఎప్పుడూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే CWC సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటిది తెలంగాణలో సమావేశంలో నిర్వహిస్తుండటంతో.. అధిష్ఠానం రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చని సీనియర్‌ నేతలు చెబుతున్నారు. అంతే కాదు ఈ సమావేశాలకు హాజరు కాబోతున్న నేతలకు నోరూరించే వంటకాలను సైతం సిద్ధం చేసారు.

ఒకటి రెండు కాదు ఏకంగా 125 రకాల తెలంగాణ ఐటమ్స్‌ (125 Telangana Items)ను అతిథులకు అందించనున్నారు. ఉదయం అల్పాహారం నుంచి భోజనం వరకు మొత్తం తెలంగాణ స్టైల్లోనే ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వంట మనుషులను తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ(Idly), వడ, దోశ, ఫ్రూట్ సలాడ్, ఉప్మా, కిచిడీ, కుర్మా, రాగి సంగటి, మిల్లెడ్ వడలను వడ్డించనున్నారు.

మధ్యాహ్నం భోజనంలోనికి హైదారాబాదీ ధమ్‌ బిర్యానీ (Dhum Biryani), బగార రైస్‌, బోటీ కూర, తలకాయ కూర, పాయ, మటన్, మటన్ లివర్‌ ప్రై, తెలంగాణ స్పెషల్ మటన్‌ కూర, చింతచిగురు మటన్, గోంగూర మటన్‌, దోసకాయ మటన్‌, అంకాపూర్ చికెన్‌, చేపలు, హలీం వంటి వాటిని నాన్‌ వెజ్‌ మెనూగా అందిస్తున్నారు. వీటితో పాటు పచ్చి పులుసు, గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, పలు రోటి పచ్చళ్లు వడ్డించనున్నారు. సాయంత్రం స్నాక్స్‌ గా సర్వ పిండి, కుడుములు, మురుకులు, మక్క గుడాలు, మొక్క జొన్న గారెలు, సకినాలు, గారెలను అతిధులకు అందించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. వీటన్నింటితో పాటు మరో 12 రకాల స్వీట్ ఐటమ్స్‌, ఇరానీ ఛాయ్‌, ఉస్మానియా బిస్కెట్లను అందిస్తున్నారు.

Read Also : Telangana : కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపిన తుమ్మల