Site icon HashtagU Telugu

HYD Police Commissioner CV Anand : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

Hyd Police Commissioner Cv Anand

HYD Police Commissioner CV Anand : సీవీ ఆనంద్.. హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌గా ఇవాళ ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా  సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పడిన వెంటనే ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లను(HYD Police Commissioner CV Anand) అప్ప‌గించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు హైద‌రాబాద్ సీపీగా అవకాశం కల్పించారు. వాస్తవానికి సీవీ ఆనంద్ 2021 డిసెంబ‌ర్ నుంచి 2023 అక్టోబ‌ర్ వ‌ర‌కు హైద‌రాబాద్ సీపీగా సేవలు అందించారు. 2023 ఎన్నిక‌ల టైంలో ఆయ‌న‌ను సీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు.

Also Read :Production Moving To China : ఉత్పత్తి రంగంలో చైనా రారాజు.. భారత్ తలుచుకున్నా అది సాధ్యమే : రాహుల్ గాంధీ