CV Anand : డీజే శబ్దాలు, టపాసుల వాడకంపై సీవీ ఆనంద్‌ కీలక సమావేశం

CV Anand : కేవలం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగానే కాకుండా మిలాద్ ఉన్ నబి వేడుకల్లోనూ డీజే నృత్యాలు విపరీతమయ్యాయని చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
New Year Guidelines

New Year Guidelines

Police Commissioner CV Anand : మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనందర్‌ అధ్యక్షతనగురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మత సంఘాల ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులతో పాటు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రాపాలీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు, మత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also:KTR : రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా.. సర్కస్ నడుస్తుందా?: కేటీఆర్‌

డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సౌండ్స్‌తో నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరు గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని, డీజే సౌండ్స్ శృతి మించుతున్నాయన్నారు. కేవలం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగానే కాకుండా మిలాద్ ఉన్ నబి వేడుకల్లోనూ డీజే నృత్యాలు విపరీతమయ్యాయని చెప్పారు. పండుగలు, ఉత్సవాలు లేదా ఏదైనా ర్యాలీల్లో డీజేలు ఎక్కువుగా వాడుతున్నారని తెలిపారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. డీజే శబ్దాలను కట్టడి చేయాలని వివిధ సంఘాల నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ మత సంఘాల ప్రతినిధులను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. అందరి అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని, ఆ తర్వాత ప్రభుత్వం డీజేలపై ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీజే శబ్దాలపై నియంత్రణ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు.

Read Also:Punjab Kings: ప్రపంచకప్ విన్నింగ్ కోచ్‌ను తొలగించిన పంజాబ్ కింగ్స్..!

మితిమీరిన సౌండ్స్‌తో డీజేల వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం డీజేలపై పలు ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీజేలు పెట్టడానికి సమయాలను నిర్దేశించడంతో పాటు, సౌండ్ పర్సంటేజీపై ఆంక్షలు పెట్టడంతో పాటు.. ఏయే సందర్భాల్లో డీజే వినియోగించాలి, ఏ సందర్భాల్లో డీజేలు ఉపయోగించకూడదనే దానిపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏయే ప్రదేశాల్లో డీజేను అనుమతించాలి. ఏ ప్రదేశాల్లో అనుమతించకూడదనే విషయంలోనూ ప్రభుత్వం కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించనుందనే చర్చ జరగుతోంది. పోలీసు అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Read Also:India UNSC : ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు చోటు దక్కాల్సిందే : ఫ్రాన్స్ ప్రెసిడెంట్

  Last Updated: 26 Sep 2024, 05:37 PM IST