Site icon HashtagU Telugu

CM Revanth : వాళ్లకు కరెంట్, నీళ్లు కట్ – సీఎం రేవంత్ హెచ్చరిక

Cm Revanth Reddy Kcr Mortua

Cm Revanth Reddy Kcr Mortua

తెలంగాణ(Telangana)లో డ్రగ్స్ (Drugs)నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీటిని సరఫరా చేయకుండా కట్ చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని యువతను మాదకద్రవ్యాల ప్రభావం నుంచి రక్షించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేయడం లేదా సేవించడం చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.

Malavika Mohanan : మీరు వర్జినేనా..? ప్రభాస్ హీరోయిన్ ఏ సమాధానం చెప్పిందంటే !

రాష్ట్రంలో కొందరు ఫార్మ్ హౌస్లను డ్రగ్స్ పార్టీలకు కేంద్రాలుగా మార్చుకున్నారని, అలాంటి ప్రదేశాలపై పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారని సీఎం తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ రాజకీయ ఒత్తిడులైనా తమ చర్యలను అడ్డుకోలేవని హెచ్చరించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల విక్రయదారులను సహించబోమని రేవంత్ స్పష్టం చేశారు.

Yo-Yo Score: ఫిట్‌నెస్ విష‌యంలో విరాట్ కోహ్లీకి చెక్ పెట్టిన తెలుగు కుర్రాడు.. యో-యో స్కోర్ ఎంతంటే?

రాష్ట్రంలో విద్యాసంస్థలు మాదకద్రవ్యాల దొంగ విక్రయాలకు అడ్డాగా మారకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. కాలేజీల్లో గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులను డ్రగ్స్ మత్తు నుంచి రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చే లక్ష్యంతో కఠిన చర్యలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.