Site icon HashtagU Telugu

Telangana: పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది

Son Killed Father

Crime Scene

సమాజంలో రోజురోజుకి మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. పెళ్లి (Marriage)కి ఒప్పుకోలేదని ప్రేమించిన యువతిపై ఓ యువకుడు దాడికి దిగి గాయపర్చాడు. హన్మకొండ జిల్లా కాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి అంగీకరించడం లేదని ప్రేయసి గొంతు కోశాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది.ఈ ఘటన మంగళవారం నాడు మండలంలోని కడిపికొండలో జరిగింది. తనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసిన ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన సివ్వి శ్రీనివాస్, యువతి(26) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో శ్రీనివాస్ యువతి మతాన్ని స్వీకరించాడు. అయినా యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొన్నిరోజులుగా గొడవలు పడుతున్నారు. ఇదే విషయంపై శ్రీనివాస్ మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. కోపంలో శ్రీనివాస్ తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో యువతి గొంతు, చేయి కోసి గాయపరిచాడు.

Also Read: Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. థియేటర్స్‌లో బయటి ఫుడ్‌ పై తీర్పు..!

ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడి మీద దాడి చేసి చితకబాదారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. యువతిని వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు. పోలీసులు ఈ కేసే విచారణ చేస్తున్నట్లు తెలిపారు. యువతి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.