Site icon HashtagU Telugu

CM Revanth Reddy : కుష్మన్​ అండ్​ వేక్​ ఫీల్డ్​ కంపెనీ ప్రతినిధి తో సమావేశమైన సీఎం రేవంత్

Cushman And Wakefield Asia

Cushman And Wakefield Asia

సీఎం రేవంత్ (CM Revanth Reddy) మంగళవారం సచివాలయంలో లాక్‌హీడ్ మార్టిన్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్, కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో (Cushman and Wakefield Asia Pacific CEO) మ్యాథ్యూ భౌ (Matthew Bouw) ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు (D. Sridhar Babu)తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ పక్క రాష్ట్ర పాలనా ఫై దృష్టిసారిస్తూనే..మరోపక్క రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సదస్సులకు హాజరై..అగ్ర సంస్థలతో పెట్టుబడుల విషయమై మాట్లాడి ఆకట్టుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ఈరోజు లాక్‌హీడ్ మార్టిన్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్, కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్నతీరుపై ఈ భేటీలో చర్చించారు. హైదరాబాద్​ను న్యూయార్క్​ నగరంలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్​ రింగ్​ రోడ్డు, మెట్రో రైలు మార్గాల విస్తరణతో హైదరాబాద్​ మరింత అద్భుతంగా తయారు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్​ హైదరాబాద్​ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తమ అధ్యయనంలో తేలిందని కుష్మన్​ అండ్​ వేక్​ ఫీల్డ్​ కంపెనీ ప్రతినిధి బృందం వివరించింది. గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్​, ఆఫీసు స్పేస్​, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్​ స్పేస్​లోనూ హైదరాబాద్​ సిటీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని ఆ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుందని పేర్కొంది.

తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, హైదరాబాద్​ను ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని ఈ సందర్భాంగా సీఎం రేవంత్ అన్నారు.

Read Also : Pawan Kalyan : చంద్రబాబును సాయం కోరిన పవన్ కళ్యాణ్