తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలు (Telangana Panchayat Elections) ఎప్పుడు జరుగుతాయా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్పంచ్ ల పదవి కాలం పూర్తి అయ్యి నెలలు కావొస్తున్నా ఇంకా పంచాయతీ ఎన్నికలఫై క్లారిటీ లేదని మొన్నటివరకు అంత మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మంత్రి పొంగులేటి (Minister Ponguleti Srinivas Reddy) బీసీ జనగణన అనంతరం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఇంకాస్త సమయం పడుతుందని అంత భావించారు. కానీ ఆగస్టు నెలలోనే పంచాయతీ ఎన్నికలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేసారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రభుత్వ యంత్రాగం స్పీడ్ చేసింది. ఆగస్టు 2, 3 తేదీల్లో ప్రతి జిల్లా నుండి ఐదుగురికి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈసీ శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జనవరిలో గ్రామ పంచాయతీల పదవి కాలం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేకపోవడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. దీంతో వీలైనంత తొందరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
Read Also : YS Sharmila : జగన్ నీ మూర్ఖత్వానికి నిన్ను మ్యూజియంలో పెట్టాలి – వైస్ షర్మిల