Phone Tapping : కేటీఆర్ ఆదేశాలతోనే ఆ కేసులు.. ‘ఫోన్ ట్యాపింగ్’‌ కేసు దర్యాప్తులో వెలుగులోకి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 03:47 PM IST

Phone Tapping : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నాటి విపక్ష నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ ఉన్నతాధికారుల ఫోన్లపై నిఘా పెట్టారని విచారణలో తేలింది. తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో బుధవారం కౌంటర్‌ అఫిడవిట్‌‌ను దర్యాప్తు ఆఫీసర్లు దాఖలు చేశారు. దానిలోని కీలక వివరాలను ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

కౌంటర్‌ అఫిడవిట్‌‌‌లో సంచలన విషయాలు

  • కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్‌రావు తదితర బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు సైబరాబాద్‌ పోలీసులపై ఆనాటి స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) చీఫ్‌ ప్రభాకర్‌రావు ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడి వల్లే  అప్పట్లో సంధ్య కన్వెన్షన్‌ ఎండీ సారనాల శ్రీధర్‌రావుపై సైబరాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.
  • ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణలను కూడా ప్రణీత్‌ బృందం ట్యాపింగ్ చేసేదట. ఈ ప్రక్రియకు ఆర్‌ఆర్‌(రేవంత్‌రెడ్డి) మాడ్యూల్‌ అని పేరు పెట్టుకున్నారట.
  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావే మాస్టర్‌ మైండ్‌.  ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు కూడా కీలకం. ఇంటర్‌పోల్‌ బ్లూ నోటీస్‌ ద్వారా వారిద్దరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • శ్రవణ్‌రావుతోపాటు నవీన్‌రావు సూచనల మేరకు చాలామంది కీలక విపక్ష నేతల ఫోన్లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్‌ చేశారు.

Also Read :Masa Shivaratri : ఇవాళ మాస శివరాత్రి.. శివపూజతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

ఎవరెవరి సీడీఆర్, ఐపీడీఆర్‌ సేకరించారంటే..

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ఎవరెవరి సీడీఆర్, ఐపీడీఆర్‌లను సేకరించారనే వివరాల్లోకి వెళితే ఈ జాబితాలో అనుముల రేవంత్‌రెడ్డి, అనుముల కొండల్‌రెడ్డి, అనుముల తిరుపతిరెడ్డి, వినయ్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అర్వింద్, శివధర్‌రెడ్డి, ఎ.ఆర్‌.శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, ఎం.రమేశ్‌రెడ్డి, రొనాల్డ్‌రాస్, దివ్య (ఐఏఎస్‌ అధికారిణి)ల సీడీఆర్, ఐపీడీఆర్‌లను సేకరించారు.   శశాంక్‌ తాతినేని, సునీల్‌రెడ్డి, చిలుక రాజేందర్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్‌ చౌదరి, తీన్మార్‌ మల్లన్న, మహేశ్వర్‌రెడ్డి, ఏఎంఆర్‌ ఇన్‌ఫ్రా, వీరమల్ల సత్యం, మేఘా శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్‌ తదితరుల సీడీఆర్, ఐపీడీఆర్‌లను సేకరించారు.

Also Read :UK Elections : రిషి మళ్లీ గెలుస్తారా ? నేడే బ్రిటన్‌లో ఓట్ల పండుగ