Site icon HashtagU Telugu

BRS : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..ఎందుకంటే ..!!

Criminal Case File Brs Mla

Criminal Case File Brs Mla

హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy)పై క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు అయ్యింది. నిన్న (మంగళవారం) హుజురాబాద్ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నిరసనకు దిగారు. దీనికి సంబంధించి జెడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి నెలకున్న సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అయితే ఈ రివ్యూ మీటింగ్‌కు హాజరైన MEOలను..డీఈఓ ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో ఆ డీఈఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను పట్టుబట్టారు..కౌశిక్‌రెడ్డి. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలంటూ సమావేశ కార్యక్రమంలో ఆందోళనకు దిగారు. సమావేశంలో ధర్నాకు దిగిన కౌశిక్‌రెడ్డి తీరును తప్పుబట్టారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ రవీందర్‌. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వ్యక్తిగత దూషణలకు దిగారు.

అలాగే దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. దళితబంధు అంశంతో పాటు డీఈవో అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని కౌశిక్‌ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌ను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకుని అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ఘటనపై జెడ్పీ సీఈవో అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు పోలీసులు. కాగా బీఎన్ఎస్ యాక్టులో (BNS Act) కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలిచారు.

Read Also : Tollywood : డిసెంబర్ సినిమాలకు రెడ్ అలర్ట్ తప్పదా..?