Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకు సీపీఎస్ మద్దతు

పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోనే స్పష్టత ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఒక ప్రకటనలో తెలిపారు

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 04:27 PM IST

ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (Warangal – Khammam – Nalgonda BY MLC Elections)కు గాను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna) కు సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులు బహిరంగంగా మద్దతు పలికారు. పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోనే స్పష్టత ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయ కుటుంబాల్లోని పట్టభద్రులు ‘సీపీఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్ధరణ’ స్లోగన్‌తో తీన్మాల్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు లభించనున్నది. ఇక ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఈసీ నిబంధనలు లేవని వివరించింది.

Read Also : KTR : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది – కేటీఆర్