Site icon HashtagU Telugu

Breaking : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం సోదరుడు దారుణ హత్య..!!

USA

USA

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే వీరబద్రం సోదరుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యాడు. ఈ మధ్యే సీపీఎం నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన కృష్ణయ్యను కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడని సమాచారం. బైకుపై ఇంటికి వెళ్తుండగా ఆరుగులు వ్యక్తులు ఆటోతో ఆయన వాహనాన్ని ఢీ కొట్టారు. తర్వాత వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.