CPM : కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే బరిలోకి దిగుతున్న సీపీఎం

కాంగ్రెస్ - సీపీఎం పొత్తు ఉంటుందా..? ఉండదా..? అనే ఉత్కంఠ కు తెరపడింది. కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే సీపీఎం ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది

  • Written By:
  • Publish Date - November 2, 2023 / 05:04 PM IST

కాంగ్రెస్ – సీపీఎం పొత్తు (CPM alliance with Congress) ఉంటుందా..? ఉండదా..? అనే ఉత్కంఠ కు తెరపడింది. కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే సీపీఎం (CPM) ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – సీపీఎం పొత్తు ఉండబోతుందని, ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగబోతున్నాయని మొదటి నుండి ఇరు పార్టీల నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు చేరడం తో సీపీఎం కు ఇద్దామనుకున్న టికెట్ల ఫై గందరగోళం ఏర్పడింది. పలు స్థానాలను వీరు అడుగా..కాంగ్రెస్ మరో చోట ఇస్తామని చెప్పుకుంటూ వచ్చింది.

ఇలా సమయం గడిచిపోతున్న..పొత్తు ఫై కాంగ్రెస్ ఎటు తేల్చి చెప్పకపోయేసరికి రెండు రోజుల క్రితం..కాంగ్రెస్ కు తమ్మినేని (Tammineni డెడ్ లైన్ విధించారు. రెండు రోజుల్లో పొత్తు ఫై క్లారిటీ ఇస్తారా..లేదంటే ఒంటరిగా బరిలోకి దిగుతామన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నుండి ఎలాంటి స్పందన రాకపోయేసరికి చివరికి ఈరోజు ఒంటరిగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 17 స్థానాల్లో పోటీ కి సై అన్నారు.

  • భద్రాచలం
  • అశ్వారావుపేట
  • పాలేరు
  • మధిర
  • వైరా
  • ఖమ్మం
  • సత్తుపల్లి
  • మిర్యాలగూడ
  • కోదాడ
  • నల్గొండ
  • నకిరెకల్
  • భువనగిరి
  • హుజూర్ నగర్
  • జనగామ
  • ఇబ్రహీంపట్నం
  • పటాన్ చెరు
  • ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

Read Also : BJP Releases 3rd List : బిజెపి మూడో విడత అభ్యర్థుల లిస్ట్ విడుదల