Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు.

Modi Interview With NTV: తెలంగాణలో ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌పై ఉన్న కోపం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మేలు చేసిందన్నారు. కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు.

తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌… డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ అనే మాట వినడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రచారంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ ఉందని తాను చెప్పానని.. కానీ తాను ఎవరి పేరును ప్రస్తావించలేదన్నారు. అయితే కొంతమంది ఆర్ఆర్ అంటే తమని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ విజన్ గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం చాలా వెనుకబడి ఉందన్నారు. న్యాయం చేసేందుకు వారికి అండగా నిలిచామన్నారు. బంజారాలు కూడా చాలా వెనుకబడి ఉన్నారు… చిన్నపాటి ప్రయోజనాలను కూడా పొందలేకపోతున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ ముందున్న యోచన ఉందన్నారు. తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పాలనపై నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయన్నారు. బీఆర్‌ఎస్‌పై కోపంతో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే తామే రాజులమని… ప్రజలకు ఏమీ చేయనన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రధాని చెప్పారు.

ఆర్ ఆర్ ట్యాక్స్, మద్యం కుంభకోణం వంటి అవినీతిని ఏ రాష్ట్రంలోనూ ఉపేక్షించేది లేదన్నారు. అవినీతిపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఇది తన నిబద్ధత అని స్పష్టం చేశారు. అవినీతి తమ హక్కు అని కొందరు అనుకుంటున్నారని… అందుకే అక్రమాలకు పాల్పడిన వారికి బెయిల్ కూడా రావడం లేదన్నారు. తాను పార్టీ పేరు చెప్పదలచుకోలేదని… అలాంటి పార్టీ ఎంతకాలం మనుగడ సాగిస్తుందో ఇప్పుడు చెప్పలేనని అన్నారు.

Also Read: Gujarat Titans Won: చెన్నైని చిత్తు చేసిన గుజరాత్‌.. 35 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఓట‌మి