Site icon HashtagU Telugu

CPI – Congress : సీపీఐకి కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు

Congress Hashtag

Congress Hashtag

CPI – Congress :  కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు కన్ఫార్మ్ అయింది. కాంగ్రెస్ పార్టీ.. సీపీఐకి కొత్తగూడెం సీటుతో పాటు ఓ ఎమ్మెల్సీ పదవిని కూడా ఆఫర్‌గా ప్రకటించినట్లు తెలుస్తోంది. మునుగోడులో  సీపీఐ, కాంగ్రెస్ మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మునుగోడులోనూ పోటీ వద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించగా.. ఈరోజు రాత్రికల్లా దీనిపై సీపీఐ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సీపీఎంతో పొత్తుపైనా సీపీఐ నేతలు ప్రస్తావించారు. ఇక ఖమ్మం జిల్లాలో ఓ సీటును సీపీఎంకు కేటాయించాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ పెద్దలను డిమాండ్ చేశారు.కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై సీపీఎంతో చర్చిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ఓ వైపు  నామినేషన్ల పర్వం మొదలైంది. ఈనేపథ్యంలో రేపో, మాపో 19 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో మూడో లిస్ట్‌ను కాంగ్రెస్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 19 స్థానాల్లో ప్రధాన నేతల నియోజకవర్గాలు ఉండటంతో సీనియర్ నేతలు సైతం ఈవిషయంలో జోక్యం చేసుకునేందుకు సాహసించడం లేదు. కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన ఈ స్థానాల జాబితాలో.. వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్ ఉన్నాయి. ప్రత్యేకించి తుంగతుర్తి, సూర్యాపేట అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన కొనసాగుతోంది. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య పోటీ నెలకొనగా.. తుంగతుర్తి సీటును ఆశీస్తున్నవారి సంఖ్య పెద్ద సంఖ్యలో ఉంది. గత ఎన్నికల్లో సైతం చివరి వరకు నాన్చడంతో ఈ రెండు స్థానాలను స్వల్ప ఓట్లతో కొల్పోయింది కాంగ్రెస్. ఈసారి కూడా అదే దిశగా పరిణామాలు చోటుచేసుకుండటంపై పలువురు కాంగ్రెస్ నేతలు(CPI – Congress) పెదవి విరుస్తున్నారు.

Also Read: Airtel Digital Head: ఎయిర్‌టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ కంపెనీకి రాజీనామా..!

Exit mobile version