Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ(ఎం) నేతలు కలిశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సిపిఎం నాయకులు బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఇతర పార్టీ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా పాల్గొన్నారు.
సీఎంతో సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని నేతలు తెలిపారు. ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రితో పలు అంశాలపై నేతలు చర్చించారు.
కాగా గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం టికెట్ కేటాయించగా..కూనంనేని సాంబశివరావు ఘన విజయం సాధించారు. మిగిలిన 118 స్థానాల్లో కమ్యూనిస్టులు హస్తానికి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. అటు సిపిఎం మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. తాజాగా లోకసభ ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది.
Also Read: Sharad Pawar Z Plus Security: శరద్ పవార్‌కు ‘జెడ్ ప్లస్’ భద్రత, 55 మంది సెక్యూరిటీ