Site icon HashtagU Telugu

HYD : CPI నారాయణకు ఘోర అవమానం…6గంటలపాటు ఫ్లోరిడా ఎయిర్ పోర్టులోనే..!!

Narayana

Narayana

CPI అగ్రనేత నారాయణకు అవమానం ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో ఆయనను సిబ్బంది అడ్డుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ..సోమవారం రాత్రి క్యూబాలోని హవానా ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లారు నారాయణ. అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో నారాయణ ఫొటో కూడా దిగారు.

ఇది కూడా చదవండి: హిందువులు తెలివైనవారు..వారిది మంచి ప్రవర్తన: యూకే దినపత్రిక

అయితే ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో నారాయణ వివరాలను అడిగి తెలుసుకున్న సిబ్బంది….క్యూబా దేశ అధ్యక్షుడితో దిగిన ఫొటోను చూసి 6 గంటల పాటు అక్కడే నిలిపేశారు. ఆ తర్వాత నారాయణ గురించి పూర్త వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయనను వదిలేశారు. ఈ విషయాన్ని నారాయణ సోమవారం మీడియాకు సందేశం పంపించారు.

Exit mobile version