CPI Narayana : కేసీఆర్ కు నారాయణ సలహా…జ‌గ‌న్‌ను కూడా మీ కూటమిలో చేర్చుకోండి. !!

దేశరాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న టీఆరెస్ అధినేత సీఎం కేసీఆర్ చర్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు.

Published By: HashtagU Telugu Desk
Narayana

Narayana

దేశరాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న టీఆరెస్ అధినేత సీఎం కేసీఆర్ చర్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీని నారాయణ స్వాగతించారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ను కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని కేసీఆర్ కు నారాయణ సలహాఇచ్చారు.

గురువారం హైదరాబాద్ లోని ముగ్దూం భవన్ లో ఆయన మీడియాలో మాట్లాడారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న బీజేపీ నేతలు సినిమా హీరోలను కలుస్తున్న తీరుపై స్పందించారు. అమిత్ షా తెలంగాణ టూర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై నారాయణ స్పందించారు. గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ అమిత్ షాను కలవడం వెనకున్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సినిమా యాక్టర్లను ప్రసన్నం చేసుకుంటున్న బీజేపీ వారి ద్వారానే తెలంగాణలో టీఆరెస్ ను బలహీనపర్చాలన్న ఆలోచనలో ఉందని వ్యాఖ్యానించారు.

 

  Last Updated: 01 Sep 2022, 03:49 PM IST