CPI Narayana Injured : హాస్పటల్ లో చేరిన సీపీఐ నేత నారాయణ

రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు

Published By: HashtagU Telugu Desk
Cpi Narayana

Cpi Narayana

సీపీఐ సీనియర్ నేత నారాయణ (CPI Narayana ) హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ నారాయణ జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ… ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు.

ఈ సమయంలో నొప్పి (Injured) ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే చికిత్స చేసి రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాను బాగానే ఉన్నానని..ఎవరు ఆందోళన చెందవద్దని నారాయణ సూచించారు. ఈ విషయం తెలిసి పార్టీ నేతలు, అభిమానులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో దూకుడు కనపరుస్తున్నాయి. ఈసారి మిత్రపక్షాలైన సిపిఐ , సిపిఎం పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నాయి. ప్రస్తుతమైతే భువనగిరిలో సిపిఎం ఒంటరి గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది.

Read Also : Mumbai Indians: కొత్త కెప్టెన్… పాత జట్టు.. ముంబై ఆరేస్తుందా ?

  Last Updated: 20 Mar 2024, 03:10 PM IST