తెలంగాణ అసెంబ్లీ(TG Assembly )లో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao ) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu) గత పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు టూరిజాన్ని ప్రోత్సహించడంపై ఆయన పేర్కొంటూ, ఖర్చులేనిది ఏదైనా ఉంటే అది టూరిజమేనని అభిప్రాయపడ్డారు.
Rs 78000 Crore Unclaimed: ఖాతాల్లోని రూ.78వేల కోట్లు ఎవరివి ? ఎందుకు తీసుకోవడం లేదు ?
తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి కూనంనేని అనేక సూచనలు చేశారు. ముఖ్యంగా నేలకొండపల్లి, పాపికొండలు, నాగార్జునసాగర్ వంటి ప్రదేశాలను పర్యాటక హబ్‌లుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి ఆలయాన్ని కూడా అధికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం ఎంతగానో నష్టపోయిందని చెప్పారు.
ఖమ్మం జిల్లాలో రహదారుల అభివృద్ధిపై అసంతృప్తిని వ్యక్తం చేసిన కూనంనేని, కొత్తగూడెం, భద్రాచలం రూట్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. అంతేకాక మద్యపాన నిషేధం అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, కల్లు గీత కార్మికుల జీవితాలను ప్రభుత్వం గుర్తించి వారికి సహాయం చేయాలని కోరారు.