Jubilee Hills: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ మద్దతు కోరుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మాగ్దూం భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఈటి నరసింహ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, కలవేణ శంకర్, ఎం. బాలనరసింహ, బాగం హేమంతరావు, వి.ఎస్.బోస్, సీపీఐ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యంలతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు సీపీఐ అందిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్- సీపీఐ కీలక చర్చ
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు.
Also Read: Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు
ముఖ్యంగా చర్చించిన అంశాలు
రాష్ట్రంలో బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా మరింత ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ విషయంలో భవిష్యత్ కార్యాచరణ, పోరాట వ్యూహాలపై చర్చ జరిగింది. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి పనిచేయడం, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి నేతలు చర్చించారు.