Site icon HashtagU Telugu

ABVP Student Issue : ఏబీవీపీ ఝాన్సీ ఘటనలో..మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన సీపీ

Abvp Jhansi

Abvp Jhansi

వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా నిలిచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ మహిళా కార్యకర్త ఝాన్సీ (ABVP Student Jhansi) పై లేడీ కానిస్టేబుల్స్‌ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. సాటి మహిళ అని కూడా చూడకుండా అయేషా (Constable Ayosha) అనే కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించింది. స్కూటీ వెనకాల కూర్చొన్న ఆమె ఝాన్సీ జట్టు పట్టుకొని లాగింది. దీంతో ఝాన్సీ కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ ఘటన ఫై యావత్ రాష్ట్ర ప్రజలు , రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ సీపీ సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ ఉత్తర్వులు జారీచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వ్యవసాయ వర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని,. సిరులు పండించడంతోపాటు దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నం పెడుతున్న గుండెకాయవంటి వ్యవసాయవర్సిటీని చీల్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం సరికాదని రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయింపు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేయకూర్చి దేశంలోనే అగ్రగామిగా చేసి రైతులకు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగడాలను విత్తనాలను పై పరిశోధన, అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడింది. అలాంటి వర్సిటీలో 35 సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్స్ వెజిటేబుల్స్ సీడ్స్ ఆ గ్రూప్ ఫారెస్ట్రీ మొదలగు వాటిపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగి రైతాంగాన్ని పటిష్టం చేయడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతోంది. కొత్త సర్కార్ ఆగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి జీవో నెంబర్ 55ను తీసుకరావడం సరికాదు. అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమే. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం మరింత తీవ్రంగా మారుతుందని వారంతా హెచ్చరించారు.

Read Also : Pak Sailors Rescued : 19 మంది పాక్ మత్స్యకారులను రక్షించిన ఇండియన్ నేవీ