కరోనా కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న సందర్భంలోనే పబ్లిక్ గ్యాదరింగ్స్ జరిగే ప్లేసుల్లో కేసులు పెరుగుతున్న వార్తలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
మొన్ననే కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీ వల్ల అక్కడి విద్యార్థులకు పదులసంఖ్యలో కరోనా వ్యాప్తి జరిగింది. తాజాగా తెలంగాణలోని మరో విద్యాసంస్థలో సేమ్ సీన్ రిపీట్ అయింది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని టెక్ మహేంద్ర యూనివర్సిటీలోని విద్యార్థుల్లో ఒకేసారి పదుల సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. క్యాంపస్ లో పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.
యూనివర్సిటీలో ప్రస్తుతానికి 25మంది విద్యార్థులతో పాటు, అయిదుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ క్వారంటీన్‌లో ఉండమని వైద్యులు సూచించారు. క్యాంపస్ లో ఎంతమంది విద్యార్థులకు కరోనా సోకిందో క్లారిటీ లేదు కాబట్టి ఈ సెలవుల తర్వాత క్యాంపస్ మొత్తం శానిటైజేషన్ చేసి ఆతర్వాతే క్లాసులు నిర్వహిస్తామని యూనివర్సిటీ తెలిపింది.