Site icon HashtagU Telugu

Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు.. ఫామ్ హౌజ్‌లో పూజ‌లు..!

KCR Comments

KCR Comments

Court Notices To KCR: బీఆర్​ఎస్​ అధినేత‌​, మాజీ సీఎం కేసీఆర్​కు (Court Notices To KCR) భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 17న తమ ముందు హాజరుకావాలని గురువారం నోటీసులు పంపింది. సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మితా సబర్వాల్​కు కూడా కోర్టు తరపున సమన్లు జారీ అయ్యాయి. అయితే కాళేశ్వ‌రం లాంటి ప్రాజెక్ట్‌లో భాగంగా క‌ట్టిన‌ మేడిగ‌డ్డ బ్యారేజీకి న‌ష్టం వాటిల్లి కొన్ని వేల కోట్ల ప్ర‌జ‌ల సొమ్ము వృథా అయింద‌ని.. ఈ అంశంపై విచార‌ణ జ‌రిపించాల‌ని భూపాల‌ప‌ల్లి జిల్లాకు చెందిన రాజ‌లింగ‌మూర్తి అనే వ్య‌క్తి జిల్లా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన విచార‌ణలో కేసీఆర్ త‌ర‌పున న్యాయ‌వాదులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

Also Read: J-K Assembly Polls: జమ్మూలో అమిత్ షా ఎన్నికల ప్రచారం, బీజేపీ మేనిఫెస్టో 

అయితే ఈ పిటిష‌న్‌ను విచారించిన కోర్టు మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రి హ‌రీశ్ రావుతో పాటు మ‌రో 8 మందికి ఆగ‌స్టులో నోటిసులు జారీ చేసింది. ఆ నోటిసుల్లో సెప్టెంబ‌ర్ 5వ తేదీన కోర్టు ముందు హాజ‌రుకావాల‌ని ఉంది. ఈ క్ర‌మంలోనే ఈ కేసు నిన్న (గురువారం) విచార‌ణ‌లోకి వ‌చ్చింది. అయితే నోటీసులు అందుకున్న హ‌రీశ్‌రావు, మ‌రో 8 మంది హాజ‌రుకాకుండా న్యాయ‌వాదుల‌ను పంపారు. అయితే నిన్న జ‌రిగిన కోర్టు విచార‌ణ‌లో కేసీఆర్‌, అలాగే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాత్ త‌ర‌పున న్యాయ‌వాదులు ఎవ‌రూ కోర్టు హాజ‌రుకాక‌పోవండ‌తో జ‌డ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ కేసు విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 17కు వాయిదా వేస్తున్న‌ట్లు జ‌డ్జి నారాయ‌ణ బాబు ఆదేశాలిచ్చారు. గురువారం జ‌రిగిన విచార‌ణ‌కు హాజ‌రుకాని కేసీఆర్‌, స్మితా స‌బ‌ర్వాల్‌ను అదే రోజు కోర్టుకు హాజ‌రుకావాల‌ని స‌మ‌న్లు జారీ చేశారు.

ఎర్ర‌వెల్లి ఫామ్ హౌజ్‌లో యాగం చేప‌ట్టిన కేసీఆర్‌

సిద్దిపేట జిల్లా ఎర్ర‌వెల్లి ఫామ్ హౌజ్‌లో మాజీ సీఎం కేసీఆర్ పూజలు చేప‌ట్టారు. వేద పండితులతో మహా యాగం చేప‌ట్టారు. ఈ యాగానికి మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ క‌విత‌, పార్టీ నాయ‌కులు, త‌దిత‌రులు హాజ‌రుకానున్నారు. 2016లో ఇదే విధంగా ఫామ్ హోజ్ లో మహా రాజా శ్యామల యాగం చేశారు కేసీఆర్‌.