Site icon HashtagU Telugu

TSPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్‌కు కోర్టు గ్రీన్‌ సిగ్నల్

Tsgroup1

Tsgroup1

తెలంగాణ గ్రూప్-1 (TSPSC Group 1) ప్రిలిమ్స్ పరీక్షల రద్దుపై హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు ఇచ్చింది. రద్దు చేయాలనడానికి బలమైన కారణం కనిపించడం లేదంటూ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఈనెల 21 నుంచి గ్రూప్‌ 1 మెయిన్స్‌కు క్లియరన్స్‌ రావడం తో పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది.

ఇటీవలే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని వారు పిటిషన్లలో కోరారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టి వేసింది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హైకోర్టు ఈ నోటిఫికేషన్‌పై దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేయడంతో పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.

ఇక ఈ గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు హైదరాబాద్‌ కేంద్రంగా (హెచ్‌ఎండీఏ పరిధిలో) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 నుంచి అనుమతిస్తామని.. 1:30 గంటలకు గేట్లు మూసివేస్తామని ఇప్పటికే అధికారులు తెలుపడం జరిగింది. మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. తొలిరోజు ఉపయోగించిన హాల్‌టికెట్‌తోనే మిగతా పరీక్షలకు కూడా హాజరు కావాలని సూచించారు. అలాగే.. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్‌ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని TGPSC కమిషన్‌ తెలిపారు.

Read Also : Telangana Group-1 Exams