MLC Kavitha: దమ్మున్న ముఖ్యమంత్రి, ధైర్యంగల్ల ప్రకటన: ఎమ్మెల్సీ కవిత

ఒకేసారి 115 మందితో తొలి జాబితాను విడుదల చేయడం పట్ల కవిత ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Updated On - August 21, 2023 / 04:15 PM IST

మెుత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించి ఎన్నికల కదనరంగంలో ముందంజలో నిలిచారు సీఎం కేసీఆర్. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు. ఈ సారి సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తుండగా.. ఎప్పటిలాగే సిద్దిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేయనున్నారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లు పెండింగ్‌లో పెట్టారు.

అయితే ఒకేసారి 115 మందితో తొలి జాబితాను విడుదల చేయడం పట్ల కవిత ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయం ! రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ గారు 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ గారి ధైర్యవంతమైన నాయకత్వంపై, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకముంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని వినమ్రంగా కోరుతున్నాము !!’’ అంటూ రియాక్ట్ అయ్యింది.

Also Read: BRS Tickets: రాజయ్యకు బిగ్ షాక్, కడియం ను ఖరారు చేసిన కేసీఆర్