Megha Engineering : మేఘ చేతుల్లో ‘దేశ రాజకీయాలు’..అసలు నిజమెంత..?

అసలు 'మేఘ' బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 'మేఘ సంస్థ' ఎవరిదీ..? తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ సంస్థ..ఇప్పుడు దేశ రాజకీయాలనే మార్చే శక్తి గా మారబోతుందా..?

  • Written By:
  • Updated On - March 16, 2024 / 01:42 PM IST

మేఘా ఇంజినీరింగ్ (Megha Engineering) సంస్థ..ఇప్పుడు ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ప్రాజెక్ట్ (Project) లు నిర్మించే ఈ సంస్థ…రాజకీయ పార్టీలను కూడా నడిపించే స్థాయికి ఎదిగిందని బయటపడడం తో అంత ఈ ‘మేఘ’ గురించి అరా తీయడం చేస్తున్నారు. అసలు ‘మేఘ’ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ‘మేఘ సంస్థ’ ఎవరిదీ..? తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ సంస్థ..ఇప్పుడు దేశ రాజకీయాలనే మార్చే శక్తి గా మారబోతుందా..? ‘మేఘ’ లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నప్పటికీ..కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వారికే ప్రాజెక్ట్ లు అప్పజెప్పడం వెనుక కారణాలు ఏంటి..? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని కీలక పార్టీల వెనుక ‘మేఘ’ హస్తం ఎంత ఉంది..? అనేది దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond Data) గురించే చర్చ నడుస్తుంది. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) రీసెంట్ గా ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీలకు (Political Parties) నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2024 వరకు రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచే అందినట్లు తెలుస్తుంది. వీటిలో ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ (Future Gaming) తో పాటు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ( Megha Engineering) టాప్ లో ఉంది. కానీ అంత మేఘా ఇంజినీరింగ్ సంస్థ గురించే అరా తీస్తున్నారు.

ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. పదులు , వందలు కాదు ఏకంగా వేలాది కోట్లు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి అధికారిక లెక్కలు బయటకు రానప్పటికీ..ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు దాదాపు 1600 కోట్లకు పైగా ఈ సంస్థ రాజకీయ పార్టీలకు అందజేసినట్లు చెపుతున్నారు కానీ అంతకు మించి అని తెలుస్తుంది. అంత డబ్బు ఎక్కడిది..? అనేది ఇప్పుడు అందరికి ప్రశ్న గా మారింది.

హైదరాబాద్ కేంద్రంగా ఉండే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీని షార్ట్ ఫామ్ లో మెయిల్ (Meil) అని పిలువబడే ఈ సంస్థ…ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ల లలో టాప్ వన్ గా ఉందంటే అది ఆషామాషీ విషయం కాదు. చిన్న చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈ కంపెనీ..ఇప్పుడు రాజకీయ పార్టీల మనుగడను పోషించే స్థాయికి చేరింది. కేంద్రంలో బిజెపి పార్టీ కి , తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వం బిఆర్ఎస్ కు , ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి మేఘ వేలాది కోట్లు ముడుపులుగా చెల్లించిందని అంటున్నారు.

కృష్ణా జిల్లాలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన పామిరెడ్డి పిచ్చి రెడ్డి 1989లో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. పిచ్చిరెడ్డి బంధువు పురిటిపాటి వెంకట కృష్ణా రెడ్డి ఆ సంస్థకు ఎండీగా ఉన్నారు. పది మంది కంటే తక్కువ మందితో మొదలైన సంస్థ గత ఐదేళ్లలో బాగా విస్తరించింది. మేఘా ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్‌గా మొదలై, 2006లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా మారింది. ఇప్పుడు ఈ సంస్థ తెలుగు రాష్ట్రాలను దాటి, దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రధాన భాగం ఈ కంపెనీయే నిర్మించింది. అలాగే మహారాష్ట్రలోని థానే-బోరివలి జంట టన్నెల్స్ ప్రాజెక్టు, దాదాపు రూ.14 వేల కోట్ల విలువైనది కూడా మేఘా చేతుల్లోనే ఉంది.

ముంబై మెట్రొపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) నిర్మించ తలపెట్టిన థానే-బోరివలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ప్యాకేజీలను కూడా మేఘా సంస్థ దక్కించుకున్నది. ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజ కంపెనీ అయిన ఎల్ అండ్ టీని బిడ్డింగ్‌లో ఓడించి.. రూ.14,400 కోట్ల ప్రాజెక్టును మేఘా సంస్థ తమ ఖాతాలో వేసుకున్నది. ఈ ఏడాది జనవరిలో థానే-బోరివలి మధ్య టన్నెల్ నిర్మాణానికి సంబంధించి రెండు ప్యాకేజీల కోసం టెండర్లను పిలిచారు. ఈ టన్నెల్ నిర్మాణం వల్ల థానే, బోరివలి మధ్య ప్రస్తుతం ఉన్న 60 నిమిషాల ప్రయాణ సమయం 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిపోనున్నది. ప్రయాణ దూరం తగ్గడం వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు కూడా తక్కువగా కలుస్తాయని ఎంఎంఆర్డీఏ అంచనా వేసింది. రెండు భారీ టన్నెల్స్‌కు సంబంధించి మేఘా, ఎల్ అండ్ టీ మాత్రమే సాంకేతికంగా అర్హత సాధించాయి. దీంతో తుది ఫైనాన్షియల్ బిడ్లను ఏప్రిల్‌ 25న తెరిచారు. ప్యాకేజీ 1కు సంబంధించి మేఘా, ప్యాకేజీ 2కు సంబంధించి ఎల్ అండ్ టీ తక్కువ కోట్ చేశాయి. అయితే ప్యాకేజీ 2కు సంబంధించి ఎల్ అండ్ టీ తక్కువ కోట్ చేసినా అధిక మొత్తంలో ట్యాక్స్‌లు చూపించడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే మేఘ సాగునీరు, రవాణా, పవర్.. ఇలా ఆ సంస్థ అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు ఉన్నట్టు ఆ సంస్థ చెప్పుకుంది. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ కూడా వీరిదే. బర్గుండీ ప్రైవేట్, హురూన్ ఇండియా అనే రేటింగ్ సంస్థల ప్రకారం, స్టాక్ మార్కెట్లో లిస్టు కాని, భారతదేశపు టాప్ 10 మోస్ట్ వాల్యూబుల్ కంపెనీలలో మూడవ స్థానం మేఘాకు వచ్చింది. అలాగే బయటి పెట్టుబడులు లేని, అంటే బూట్ స్ట్రాప్డ్ కంపెనీలో దేశంలో రెండవ స్థానంలో ఉంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఎవరైనా కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ పనులను చేజిక్కించు కొంటోంది. అయితే ఈ సంస్థ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. భారీ ప్రాజెక్ట్ లను దక్కించుకోవడం..రీ డిజైన్ పేరుతో ప్రభుత్వం నుండి వేలాది కోట్లు రాబట్టడం..అందులో సగం వరకు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వడం చేస్తుంటుందని మేఘ ఫై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రధాన భాగం ఈ కంపెనీయే నిర్మించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని ప్రధాన పార్టీలు విమర్శిస్తున్నాయి. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీ సహా ఆయా పార్టీలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పై, మేఘా ఇంజనీరింగ్ సంస్థపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ లోకి అధికారంలోకి రాగానే… న్యాయవాది రాపోలు భాస్కర్ కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇక దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. ఇత పెద్ద మొత్తంలో ప్రజా సొమ్ము తిన్ని పార్టీలకు ధారదత్తం చేయడం వెనక ఆయన స్వప్రయోజనం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

Note : మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. మాకు అందిన సమాచారం మేరకు మీము తెలుపడం జరిగింది.

Read Also :