Lok Sabha Polls : లోక్ సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా, 525 మంది బరిలో నిలిచారు

  • Written By:
  • Publish Date - June 3, 2024 / 09:14 PM IST

తెలంగాణ లో మే 13 న 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ , బిజెపి , బిఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా అని అంత ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. తెలంగాణ లో ఈసారి బిజెపి ఎక్కువ స్థానాల్లో విజయం సాదించబోతుందని , రెండో స్థానంలో కాంగ్రెస్ నిలువనుందని , బిఆర్ఎస్ ఖాతా తెరవక పోవచ్చని అంచనా వేసాయి. మరి వారి అంచనా కరెక్ట్ అవుతుందా..లేక తప్పు అవుతుందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

ప్రస్తుతం రేపటి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా, 525 మంది బరిలో నిలిచారు. 2.20 కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. 120 హాస్టళ్లలో 1855 టేబుళ్లపై ఓట్లను లెక్కించనున్నారు. అలాగే 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 19 హాళ్లలో 276 టేబుళ్లపై లెక్కించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపుకు 10వేల మంది సిబ్బందిని నియమించారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు రేపు మొత్తం మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.

Read Also : Bandla Ganesh : హాస్పటల్ లో చేరిన బండ్ల గణేష్..ఆరోగ్యం ఫై ఫ్యాన్స్ ఆరా..!!