హుజూరాబాద్ ఉప ఎన్నిక.. సవాళ్లు, ప్రతిసవాళ్లు!

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నాయకులు తమ ప్రత్యర్థులపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:32 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నాయకులు తమ ప్రత్యర్థులపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఓటర్లు చాలా తెలివైనవారని, టీఆర్ఎస్ అందించే డబ్బును తీసుకున్నప్పటికీ, న్యాయం కోసం నిలబడిన పార్టీకి ఓటు వేస్తామని ఆయన అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం సవాల్ విసిరారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే దేనికైనా రెడీ అని, టీఆర్ఎస్ ప్రభుత్వం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తే రాజీనామా చేయడానికి కూడా రెడీగా సిద్ధమేనని ప్రకటించారు.

కాగా హుజురాబాద్‌ లో జరగనున్న ఉప ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారం వేగవంతం చేయడంతో కోవిడ్ భయం పట్టుకుంది. మళ్లీ మహమ్మారి మళ్లీ విస్తురిస్తుందేమోనని ఆందోళన అటు పార్టీలకు, ఇటు ప్రజలకు పట్టుకుంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత కోవిడ్ వ్యాప్తి చెందడంతో పాలు పార్టీల నాయకులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ లో ముందస్తు చర్యగా ప్రతి పోలింగ్ బూత్‌లో ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని, అధికారులు, అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా కోవిడ్ తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఉప ఎన్నిక విధులకుగానూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిని మాత్రమే నియమించాలని కరీంనగర్ కలెక్టర్ భావిస్తున్నారు. అంతేకాదు. రాత్రి 7 గంటల తర్వాత ప్రచారాన్ని నిలిపివేయడం వంటి ఇతర ఆంక్షలు సైతం అమలు చేయనున్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం లేదన్న కారణంతో ఈసారి దాదాపు 1000 మంది వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.ప్రతీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు కనీసం రూ.10వేల ధరావతు, అభ్యర్థికి మ ద్దతిస్తూ స్థానికంగా పదిమంది సంతకాలు చేయా లి. వీరంతా పోటీ చేయాలంటే కనీసం రూ.కోటి నగదు,కనీసం 10వేలమంది స్థానికుల మద్దతు అవసరం. వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటామంటున్నారు. ఈ అందరికీ ధరావతు, స్థానికుల మద్దతు ఎంతమేరకు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.