Telangana : సీఎం రేవంత్ కీలక నిర్ణయం..54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు

చైర్మన్లు, వైస్ చైర్మన్ల కార్యాలయాల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి సొంత డిపార్టుమెంట్లలోకి వెళ్ళిపోవాలని ఈ ఆదేశాల్లో పేర్కోన్నారు

Published By: HashtagU Telugu Desk
54 Corporation Chairmen Can

54 Corporation Chairmen Can

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటీకే పలు నిర్ణయాలు తీసుకోగా..గత ప్రభుత్వ హయంలో కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా నామినేటెడ్ పద్ధతిలో నియమితులైన వారందరి నియామకాలు (corporation chairman posts ) రద్దు చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్వర్వులు జారీ చేశారు.

చైర్మన్లు, వైస్ చైర్మన్ల కార్యాలయాల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి సొంత డిపార్టుమెంట్లలోకి వెళ్ళిపోవాలని ఈ ఆదేశాల్లో పేర్కోన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. ఇప్పటికే కొంత మంది రాజీనామా చేయగా.. మరికొందరు ఇంకా ఉద్యోగం కొనసాగుతున్నారు. ఇప్పుడు వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించారు.

We’re now on WhatsApp. Click to Join.

టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాసయాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, వికలాంగుల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కల్లుగీత సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ రజని, గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఇలా మొత్తం 54 మంది పదవులు రద్దయ్యాయి.

ఇక అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వం నియమించిన చైర్మన్లు, సలహాదారులను తొలగించడం సహజమే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసిందని చెప్పాలి. గత వారం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బీఆర్ఎస్ హయాంలో నియమించిన కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డి. ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.

Read Also : ముంబై షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ మెన్షన్ అవార్డు అందుకున్న ‘ఆస్కార్ చల్లగరిగ’

  Last Updated: 10 Dec 2023, 11:27 PM IST