శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి హంగామా జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలకు ముస్లింలంతా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు.
పాతబస్తీ తదితర ప్రాంతాల్లోని మసీదుల వద్ద పోలీసులను మోహరించాలని సూచించారు. చార్మినార్, మక్కామసీద్ ప్రాంతాల్లో దాదాపు 5 వేల మంది ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ నివాసాలకు సమీపంలోని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించాలని, అనవసరంగా బయటకు వెళ్లవద్దని ముస్లిం మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
Old City Security: శుక్రవారం పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు

Old City