Cool Breeze : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. ఇంకెన్ని రోజులు ?

Cool Breeze : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. జనవరి రాకముందే చలి తీవ్రత పెరిగింది.

  • Written By:
  • Updated On - October 28, 2023 / 07:21 AM IST

Cool Breeze : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. జనవరి రాకముందే చలి తీవ్రత పెరిగింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అత్యంత కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని మౌలాలిలో 11.5, బీహెచ్‌ఈఎల్‌లో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా చలి తీవ్రత కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (IMD) అంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల ఎఫెక్ట్‌తో ఇలా జరుగుతోందని వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఐఎండీ ప్రకారం..  ఈరోజు తెలంగాణలో పగటివేళ మినిమం 21 డిగ్రీల సెల్సీయస్, రాత్రివేళ మినిమం 19 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో పగటివేళ మినిమం 27 డిగ్రీల సెల్సీయస్,  రాత్రివేళ మినిమం 26 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఇవాళ ఉత్తర బంగాళాఖాతం నుంచి గాలులు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాయి. వీటి వేగం గంటకు 13 నుంచి 20 కిలోమీటర్లుగా ఉంది. వీటి ప్రభావం రాయలసీమపై ఎక్కువగా ఉంటుంది. అక్కడ గంటకు 11 నుంచి 15 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే ఛాన్స్ ఉంది. తెలంగాణలో గాలుల వేగం గంటకు 4 నుంచి 12 కిలోమీటర్లుగా ఉంటుందని వాతావరణ శాఖ(Cool Breeze) వెల్లడించింది.

Also Read: BellyFat : ఈ నాలుగు టిప్స్ పాటిస్తే.. పొట్ట దగ్గరి కొవ్వు కొవ్వొత్తిలా కరగడం ఖాయం..