TBJP: తెలంగాణ ‘కాషాయం’లో కుమ్ములాటలు!

రాజకీయ పార్టీల్లో ఆదిపత్య పోరు అనేది కామన్. రాజకీయంగా ఎదగడానికి నేతలు పోటీపడుతుంటారు.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 05:06 PM IST

రాజకీయ పార్టీల్లో ఆదిపత్య పోరు అనేది కామన్. రాజకీయంగా ఎదగడానికి నేతలు పోటీపడుతుంటారు. కీలక పదవులను పొందేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటారు. అంతేకాదు ఒకరినొకరు కిందికి లాగే ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటారు. ఈ తీరు ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ లో కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా కాదు…బహిర్గతంగానే ఒకరిపై విమర్శలు చేసుకుంటారు. అంతేకాదు కుస్తీలు పట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఒకరినొకరు చెక్ పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా చేసేవి. కాంగ్రెస్ చాలా ఒపెన్ కాబట్టి…అంతా ఒపెన్ గానే జరుగుతుంది. అందుకు బయటకు ఆపార్టీలో అంర్గతపోరు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ తెలంగాణలో అధికార టీఆరెస్ తో పోటీపడుతూ…అధికారం దక్కించుకునేందుకు తెగ ఆరాటపడుతున్న బీజేపీలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆ పార్టీకి సంబంధించిన ఎన్నో విషయాలు బహిర్గతం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై ఎన్నో వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు బండి సంజయ్ కు రఘునందన్ రావు మధ్య సఖ్యత కొరవడిందని ఆ ముఖ్య నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకున్నారు. అయితే ఆ పార్టీలో అంతపెద్దగా బయట కనపడని ఆధిపత్య పోరు…ఈ మధ్య కాలంలో నేతల మధ్య వార్ నడుస్తుందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే తెలంగాణ బీజేపీకి సంబంధించిన అంశాలన్నీ కూడా కేంద్ర పెద్దల చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి పార్టీలో జరిగే అంతర్గత కుమ్ములాటలు బయటకు అంతకగా కనిపించకపోవచ్చు. కానీ తెలంగాణ బీజేపీ నేతల మధ్య పోరు ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు తీవ్రం అసంత్రుప్తిగా ఉన్నారని వినిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారట. అటు కేంద్రమంత్రి కిషర్ రెడ్డి, ఇటు ఎంపీ అర్వింద్ కూడా…బండి వైఖరి పట్ల అసంత్రుప్తిగా ఉన్నట్లు సమాచారం. బండి-ఈటల రాజేందర్ కు పెద్దగా సఖ్యత లేదని ఎప్పటినుంచో వినిపిస్తోన్న మాట. ఈ ఇద్దరు నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కావడంతోనే ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువైందన్నది టాక్.

అంతేకాదు పార్టీలో ఈటెలను బండి సంజయ్ అంతగా పట్టించుకోవడం లేదట. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యతను కూడా ఇవ్వడం లేదన్న చర్చ ఈ మధ్య కాలంలో జోరుగా సాగుతోంది. అందుకే ఈటల…కేంద్ర పెద్దలతోనే చర్చలు జరుపుతుండటంతో…ఈ అంశం బండి వర్గానికి అస్సలు నచ్చడం లేదట. ఈటెలకు చెక్ పెట్టేందుకు బండి ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర పెద్దలు…రాష్ట్ర బీజేపీ నేతల్లో అంతర్గత పోరు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని…అందుకే బీజేపీ నేతల మధ్య పోరు ఎక్కువైనా బయటకు పొక్కడం లేదన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికలలోపు నేతలంతా సమైక్యంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారా…? లేదా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ…అంతర్గత కుమ్ములాటకు కారణం అవుతారానేది వేచి చూడాల్సిందే..!!!