Telugu Text Books : తెలంగాణ పాఠ్యపుస్తకాల వివాదం..ఇద్దరిపై వేటు

మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల పేర్లను ఉంచడంతో 24 లక్షల పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది

  • Written By:
  • Publish Date - June 14, 2024 / 07:31 PM IST

తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో (Telugu Text Books) ముందుమాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడం ఫై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల పేర్లను ఉంచడంతో 24 లక్షల పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఏళ్ల క్రితం నాటి ముందుమాటలో మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

బుధవారం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలో ముందుబాటలోని తప్పులను చాలా చోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేజీని తొలగిస్తే దాని వెనుకున్న వందేమాతం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. దీంతో మరిన్ని విమర్శలు వస్తాయని గ్రహించారు. ఈ క్రమంలోనే పిల్లలకిచ్చిన, ఇవ్వని పుస్తకాలన్నీ వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు.

తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తక ముద్రణ సేవల డైరెక్టర్ శ్రీనివాసాచారిపై చర్యలు తీసుకుంది. ఎస్‌సీఈఆర్‌టీ అదనపు డైరెక్టర్ రాధారెడ్డిపై సైతం యాక్షన్స్ తీసుకుంది. పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసాచారి, రాధారెడ్డిలను తొలగించింది. ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్‌కు బాధ్యతలు అప్పగించింది. టీఆర్ఈఐఎస్ కార్యదర్శి రమణకుమార్‌కి ముద్రణ సేవల డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది.

Read Also : Chandrababu Warning: ఆ IAS,IPS లకు చంద్రబాబు వార్నింగ్?