CM KCR: 4 ప్రభుత్వాలను కూల్చే కుట్ర: కేసీఆర్ సంచలన వీడియో విడుదల..!!

  • Written By:
  • Updated On - November 4, 2022 / 11:59 AM IST

ఫామ్ హౌజ్  ఫైల్స్ పూర్తి నిడివి ఉన్న సంచలన వీడియోలను తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, రాజస్థాన్ , ఏపీ ప్రభుత్వాలను కూల్చడానికి జరిగిన కుట్రను ఆధారాలతో వెల్లడించారు. మూడు గంటలు నిడివి ఉన్న డీల్ వ్యవహార వీడియోలను సుప్రీం కోర్ట్ జడ్జీలు. దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలు, కేంద్ర హోంశాఖ, జాతీయ, అన్ని రాష్ట్రాల మీడియా హౌస్ లకు వీడియోలతో కూడిన ఆధారాలను పంపినట్టు కేసీఆర్ వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ఎన్ జి రంగా టైములో వచ్చిన ఉద్యమంలా రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

లేదంటే దేశం 100 ఏళ్ళు వెనక్కు పోతుందని అన్నారు. ఒక రాజకీయ విస్ఫోటనం రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ స్పందించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను ఇంకా భరిచడానికి లేదని , అవసరం అయితే ప్రాణం సైతం దేశం కోసం పణంగా పెడతానని కేసీఆర్ ముందుకొచ్చారు. ఫార్మ్ హౌస్ ఫైల్స్ వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. ఆయన మీడియా సమావేశంలో కీలక పాయింట్లు ఇలా ఉన్నాయి.

◻️ నా జీవితంలో మొట్టమొదటిసారి చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్న

◻️ దేశంలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది

◻️ నేడు ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గం, ప్రజాస్వామ్య హత్య కొనసాగుతుంది…

◻️ ఇలా సాగితే ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం

◻️ మనకి ఊహకి కూడా అందనంత భయంకరంగా చేస్తున్నారు

◻️ అందుకే చాలా బాధతో మాట్లాడుతున్న

◻️ ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ దేశాన్ని సర్వనాశనం చేశారు

◻️దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు…

◻️ మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇప్పటిదాకా ఆగాను… ఇప్పుడు షో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది

◻️ కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి నన్ను కలిసినట్లు ఆరోపణలు చేశారు బిజెపి వాళ్లు….

◻️ ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి గెలుపోవటం అనేవి సహజం

◻️ ప్రజా తీర్పు గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది

◻️ బిజెపి వాళ్లు ఎలక్షన్ కమిషనర్ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశారు…

◻️ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ ని నియమిస్తుంది వాళ్ల పైన వాళ్లే ఆరోపణలు చేస్తున్నారు

◻️ ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాలుగు మూల స్తంభాలను బిజెపి నిర్వీర్యం చేసింది

◻️ అత్యున్న సమయంలో కూడా మేము ఇంత హీనంగా ప్రవర్తించలేదు