Site icon HashtagU Telugu

Munugode : మునుగోడులో EVMల దొంగతనానికి కుట్ర…!!

Karnataka Election

Evm

గురువారం మునుగోడులో ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా 90శాతంపైగా పోలింగ్ నమోదు అయి రికార్డు బద్దలు కొట్టింది. రాత్రి పది గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ ముగిసాక ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొంతమంది వెంబడించారు. ఈవీఎంలను నల్లగొండకు తీసుకెళ్తుండగా కొంతమంది కారులో ఫాలో అవ్వడం కలకలం రేపుతోంది. బస్సును కారు వెంబడిస్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకునేందుకు యత్నించారు.

ఇది గమనించిన దుండగలు అలర్ట్ అయ్యారు. వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఐదురుగు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకే వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.