Adani Group: అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి

అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించింది తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ మేరకు ట్విట్టర్ లో సెటైరికల్ పోస్ట్ పెడుతూ కామెంట్స్ చేసింది.అదానీ గ్రూప్‌తో కాంగ్రెస్‌ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది.

Adani Group: అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించింది తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ మేరకు ట్విట్టర్ లో సెటైరికల్ పోస్ట్ పెడుతూ కామెంట్స్ చేసింది.అదానీ గ్రూప్‌తో కాంగ్రెస్‌ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అదానీని ఆలింగనం చేసుకుని ప్రశంసించారని, గతంలో కంపెనీ ఆర్థిక లావాదేవీలపై హిండెన్‌బర్గ్ నివేదికలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని కాంగ్రెస్ కోరిన విషయాన్నీ ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది బీఆర్ఎస్. తెలంగాణాలో కాంగ్రెస్ సీఎం అదానితో ముచ్చట్లాడుతున్నారని, అయితే కేంద్రంలో మంత్రం అదే కంపెనీని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేసింది కారు పార్టీ.

అదానీ పోర్ట్స్ మరియు సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ మరియు అతని బృందం ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన విషయంతెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్టు సీఎంతో చెప్పారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఈ మేరకు బృందానికి వివరించింది. రాష్ట్రంలో పంప్‌డ్ స్టోరేజీ పవర్ సదుపాయాన్ని మరియు పవన శక్తి ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని వ్యాపార బృందం భావిస్తోంది. పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించేందుకు, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, రాయితీలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి అదానీ కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అదానీ కంపెనీ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తోందని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను కంపెనీ కొనసాగిస్తుందని, కొత్త ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ పరిశ్రమల స్థాపనకు, కొత్త ఉద్యోగాల కల్పనకు కంపెనీ సిద్ధంగా ఉందని అదానీ గ్రూప్ ప్రతినిధి బృందం తెలిపింది. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్క్‌తో పాటు డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ప్రతినిధులు చర్చలు జరిపారు.కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమావేశంలో చర్చించారు.

Also Read: Sankranti Holidays: తెలంగాణ కాలేజీలకు సంక్రాంతి సెలవు తేదీలు