Site icon HashtagU Telugu

Congress : బీఆర్ఎస్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న కాంగ్రెస్ “యూత్ డిక్ల‌రేష‌న్‌” .. నిరుద్యోగులంతా..?

Congress Hashtag

Congress Hashtag

తెలంగాణ‌లో అధికార పార్టీలో టెన్ష‌న్ మొద‌లైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతోంది. దీంతో తెలంగాణ‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స‌ర్కార్ ఒక్క విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక‌పోయింది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతలో ఆశలు నింపిన కేసీఆర్‌.. నేడు వారి వైపు కనీసం క‌న్నెత్తి కూడా చూడటం లేదు. ఉద్యోగాల విషయంలోనూ కేసీఆర్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ యువతలో ఆశా కిరణంగా మరింది. యవత భవితకు కాంగ్రెస్ నిర్ణయాలు భరోసాగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన లేదు. కనీసం పోటీ పరీక్షలు సక్రమంగా నిర్వహించ లేని దుస్థితి.

పోటీ పరీక్షలకు కేంద్రంగా ఉండే టీఎస్పీఎస్సీలోనే అక్రమాలు వెలుగుచూశాయి. పేప‌ర్ లీకేజీల‌తో నిర్వహించిన పరీక్షల‌ను రద్దు చేసారు. ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని దీన స్థితి తెలంగాణ‌లో నెల‌కొంది. నిరుద్యోగులు ఆందోళన చేస్తే వారి పైన కేసులు పెట్టి ప్ర‌భుత్వం వేధింస్తుంద‌ని నిరుద్యోగులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. వయసు దాటి పోతున్నా.. ఉద్యోగం రాలేదనే ఆవేదనతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో యువత కోసం కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ పైన ఆసక్తి పెరిగింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో టెన్షన్ పెంచుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు యువ సంఘర్షణ సభలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని చెప్పారు ప్రియాంక గాంధీ. తాము మాట తప్పితే తమను గద్దె దించాలని సూచించారు. యూత్ డిక్లరేషన్ కు జవాబుదారీగా ఉంటామని పేర్కొన్నారు. తను సోనియాగాంధీ కుమార్తెనని నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ లో భాగంగా..తెలంగాణ తొలి,మలి విడత ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పాటుగా తల్లి, తండ్రి లేదా భార్యకు రూ 25 వేల అమర వీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.