Revanth Reddy: కౌలు రైతులకు రేవంత్ రెడ్డి భరోసా!

కౌలు రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

  • Written By:
  • Updated On - September 14, 2023 / 11:54 AM IST

కౌలు రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎంత ప్రయత్నించినా పంట రుణాలు, ఇన్‌పుట్‌ ​​సబ్సిడీ, పంట నష్టపరిహారం అందకపోయినప్పటకీ,  రైతుబంధు ప్రకటించనప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ 40 శాతం భూముల్లో పని చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

ఆత్మహత్య చేసుకున్న వారిలో 80 శాతం మంది కౌలు రైతులే కావడంలో ఆశ్చర్యం లేదని, అయితే మిమ్మల్ని రైతులుగా పరిగణించబోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తేల్చిచెప్పారని రేవంత్ అన్నారు. ప్రణాళికాబద్ధత లేకపోవడం, ప్రభుత్వ నిరాసక్తత వల్ల వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్రంలో పంటల వైవిధ్యంపై ప్రభావం పడిందని రేవంత్ అన్నారు. ఇన్‌పుట్‌ ​​సాయం కింద ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

పంటలకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం జరిగితే నష్టపరిహారం అందజేస్తుందని మా ప్రభుత్వం హామీ ఇస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటామన్నారు. చారిత్రాత్మకంగా కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించడం, కౌలు రైతులను బలోపేతం చేసేందుకు బిల్లులు ఆమోదించడం, సబ్సిడీ రుణాలు, పంటల బీమా, విత్తనాలు మరియు ఇన్‌పుట్‌లకు ఎమ్‌ఎస్‌పి, ఇతర రాయితీలను ఇవ్వడం కాంగ్రెస్‌ కే సాధ్యమవతుందని రేవంత్ అన్నారు.

Also Read: Dengue Deaths: వరంగల్ జిల్లాలో ‘డెంగ్యూ’ కలకలం, 12 మంది మృతి!