Site icon HashtagU Telugu

Corona : కరోనా కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం – కేటీఆర్

Congress BC declaration is 100 percent false: KTR

Congress BC declaration is 100 percent false: KTR

బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ (Congress) పాలనను కరోనా(Corona) వైరస్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడంలో కాంగ్రెస్ ముఖ్య భూమిక పోషిస్తోందని, హైదరాబాద్ నగర అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కీలకమైన ఫ్లైఓవర్లు పూర్తి చేయలేకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేకపోవడం, పెండింగ్ ప్రాజెక్టులు కొనసాగించలేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు.

Stonecraft Group : శంషాబాద్‌ వద్ద AQI మానిటరింగ్ స్టేషన్‌

బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 10 ఏళ్లలో 4.17 లక్షల కోట్ల అప్పు చేసినా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగారని, కాని కేవలం ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.6 లక్షల కోట్ల అప్పు చేయడం అనుమానాస్పదమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద డైలాగులు చెపుతున్న, వారికీ ఆర్థిక వ్యవస్థ గురించి సరైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్, అసలు ఆ సంఖ్యలో ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియని స్థితిలో ఉందని ఆయన విమర్శించారు. అభివృద్ధి కోసం కాకుండా, ఢిల్లీకి నిధులు పంపించడమే వారి ప్రధాన ఉద్దేశ్యమని, ప్రజలకు మేలు చేయడం దూరం అని కేటీఆర్ ఆరోపించారు.

రైతులకు రుణమాఫీ కల్పించామని చెప్పిన కాంగ్రెస్, వాస్తవానికి ఒక్క గ్రామమైనా పూర్తిగా రుణమాఫీ చేసిందని నిరూపిస్తే శాసనసభ సభ్యత్వాలు వదులుకుంటామని తాము సవాల్ చేస్తున్నామన్నారు. రైతులకు అందజేసినట్లు చెప్పిన రూ.12,000 సాయం వాస్తవమేనా అని ప్రశ్నిస్తూ, నిజంగా ఆ మొత్తాన్ని అందించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల కష్టాలను తగ్గించే బడ్జెట్ ఇది కాదని, కేవలం వాగ్దానాలు చేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు.