Congress Vikarsh: కాంగ్రెస్ వికర్ష్.. చేరిన నేతలు యూటర్న్!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చేరికలను తెరలేపిన విషయం తెలిసిందే. రేవంత్ ఆపరేషన్ కాస్తా వికర్ష్ గా మారనుంది.

Published By: HashtagU Telugu Desk
revanth reddy arrest

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చేరికలను తెరలేపిన విషయం తెలిసిందే. రేవంత్ ఆపరేషన్ కాస్తా వికర్ష్ గా మారనుంది. రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా మందిని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలోచాలా మంది మళ్లీ ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. నాలుగు నెలల క్రితం మంచిర్యాల జడ్పీ చైర్మన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును సీక్రెట్‌గా ఢిల్లీకి తీసుకెళ్లి మరీ ప్రియాంకా గాంధీతో కండువా కప్పించారు రేవంత్ రెడ్డి. మూడు వారాల క్రితం నల్లాల ఓదెలు ఉంటున్న హైదరాబాద్‌ ఇంట్లో నుంచి అధికారులు సామానులు విసిరేస్తే..రేవంత్ రెడ్డి వెళ్లిపోరాడారు. అయితే ఇప్పుడు జడ్పీ చైర్మన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. నల్లాల ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్‌తోనే ప్రారంభించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆయనకు టిక్కెట్ నిరాకరించారు.

అక్కడి నుంచి పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్లోనే ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పార్టీ నేతలు బుజ్జగించారు. ఆ తర్వాత నల్లాల ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి మంచిర్యాల జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని అవమానిస్తున్నారన్న కారణంగా కాంగ్రెస్‌లో చేరారు. కానీ కాంగ్రెస్‌లో ఉండే గ్రూపు గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ వారు ఇమడలేకపోయారు. చివరికి గుట్టుగా టీఆర్ఎస్ నేతలతో మళ్లి సంప్రదింపులు జరుపుకుని చివరికి ఎలాగోలా మళ్లీ సొంత పార్టీలో చేరిపోయారు. తాను తీసుకొచ్చిన వారిని కూడా పార్టీలో ఉంచలేని నిస్సహాయ స్థితికి రేవంత్ రెడ్డి వెళ్లిపోయారు. పార్టీలు గ్రూపుల్ని ఆయన తగ్గించలేకపోవడతోనే ఈ సమస్య వస్తోంది.

  Last Updated: 07 Oct 2022, 12:16 PM IST