నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జ్, మాజీ MP , రాష్ట్ర నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (N. Uttam Kumar Reddy) ప్రాతినిత్యం వహిస్తున్న నల్గొండ జిల్లాలో ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డి అఖండ విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.51 లక్షల మెజార్టీతో గెలుపు బావుటా ఎగరేసి.. రికార్డు సృష్టించారు. తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ ఖావటం విశేషం. దీంతో.. జనారెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించటమే కాకుండా.. రఘువీర్ రెడ్డి రికార్డు క్రియేట్ చేశారు. అలాగే భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఈ విజయం ఫై ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. తాను ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లాలో దేశంలోనే మెజార్టీ విజయంగా నిలువడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఇది అరుదైన రికార్డు విజయం అని ఉత్తమ్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఉత్తమ్ ట్రాక్ రికార్డు కూడా ఎంతో గొప్పదనే చెప్పాలి. వైమానిక దళంలో భారతదేశానికి సేవలు అందించి.. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో బాధ్యతలు చేపట్టి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ శాసనసభకు 2014లో ఎన్నికయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహ, బలహీన వర్గాల మంత్రిత్వ శాఖలో పనిచేసారు. రాష్ట్ర శాసనసభకు వరుసగా ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. 1999లో మొదటిసారిగా ఆయన కోదాడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికవవ్వగా.. తెలంగాణ శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబర్ 7 నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ పక్క తన విధులను నిర్వహిస్తూనే..మరోపక్క జిల్లా కాంగ్రెస్ బాధ్యతను వహిస్తూ ఎన్నికల్లో తనదైన పాత్రను పోషిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు విడుదలైన లోక్ సభ ఫలితాల్లో నల్గొండ జిల్లా నుండి ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపులో తనదైన కృష్టి చేసి..తన బాధ్యతను నిర్వర్తించారు.
Read Also :