Congress Trategy : ముస్లిం ఓట్ల‌పై కాంగ్రెస్ ఆశ

కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచ‌డానికి (Congress Trategy) సిద్ద‌మ‌వుతోంది. నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్.

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 05:02 PM IST

కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచ‌డానికి (Congress Trategy) సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఆ రిజ‌ర్వేష‌న్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డానికి ఆ పార్టీ క‌ట్టుబ‌డి ఉంది. ఆ మేర‌కు ముస్లిం డిక్ల‌రేష‌న్ లో పొందుప‌ర‌చాల‌ని నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించ‌డానికి కాంగ్రెస్ పార్టీ సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఉన్న కేసీఆర్ స‌ర్కార్ ముస్లింకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయ‌డంలేద‌ని ఆరోపిస్తోంది. కేవ‌లం మూడు శాతం రిజర్వేష‌న్ మాత్ర‌మే ఇస్తుంద‌ని చెబుతోంది.

కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచ‌డానికి (Congress Trategy)

అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌కటించిన నాలుగు శాతం ముస్లిం రిజ‌ర్వేష‌న్ల అంశం ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో ఉంది. దానిపై రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిగా ఫైట్ చేయ‌డంలేద‌ని కాంగ్రెస్ (Congress Trategy) ఆరోపిస్తోంది. అందుకే, చ‌ట్ట‌బ‌ద్ధత చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెబుతోంది. అంతేకాదు, రిజ‌ర్వేష‌న్ల‌ను మ‌రింత పెంచ‌డానికి కూడా ఆలోచిస్తోంద‌ని మాజీ మంత్రి ష‌బ్బీర్ ఆలీ చెబుతున్నారు. ఇప్ప‌టికే రైతు, యువ‌త డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ త్వ‌ర‌లోనే మ‌హిళా డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించ‌డానికి సిద్ద‌మ‌యింది. ఆ త‌రువాత ముస్లిం డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించాల‌ని ఆ పార్టీ ఇంచార్జి మాణిక్ రావు థాక్రే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆ లోపుగా కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల కోసం ఇచ్చిన 500 సిలండ‌ర్, ఏడాదికి రూ. 15వేల రైతుల‌కు స‌హాయం, రూ. 2ల‌క్ష‌ల రుణ‌మాఫీ, ధ‌ర‌ణీ ర‌ద్దు తదిత‌ర అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది.

బీసీలకు ఎక్కువ సీట్లతో పాటు ముస్లింలకు కూడా

రాబోవు ఎన్నికల్లో ముస్లింల‌కు ఎక్కువ స్థానాల‌ను కేటాయించ‌డానికి కాంగ్రెస్ పార్టీ  (Congress Trategy) ఆలోచ‌న చేస్తోంది. ఆ విష‌యాన్ని ష‌బ్బీర్ ఆలీ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం బీసీ లీడ‌ర్లు కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ సీట్ల‌ను సాధించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. అదే త‌ర‌హా ముస్లింల‌కు టిక్కెట్ల‌ను పెంచాల‌ని ష‌బ్బీర్ కోరుతున్నారు. రాష్ట్ర జనాభాలో 12.69 శాతం మైనారిటీలు ఉన్నారు. ఆ నిష్ప‌త్తికి తగిన విధంగా సీట్ల‌ను సాధించే ప్ర‌య‌త్నం చేయాల‌ని ముస్లిం పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు ష‌బ్బీర్. బీసీలకు ఎక్కువ సీట్లతో పాటు ముస్లింలకు కూడా ఈసారి దక్కనుంది. ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో సాయం చేయాలని కూడా నిర్ణయించామ‌ని ఆయ‌న. చెబుతున్నారు.

Also Read : KCR Contest : 3చోట్ల కేసీఆర్ స‌ర్వేలు, గ‌జ్వేల్ డౌట్

ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం మీద ఈసారి ముస్లింలు క‌న్నేశారు. అక్క‌డ‌ 3,11,000 మంది ఓటర్లు ఉండ‌గా, ముస్లింలు 45,000 మంది ఉన్నారు. అక్క‌డ‌ 50,000 మంది చౌదరిలు ఉండగా, వారిలో చాలా మంది విదేశాల‌కు వెళ్లారు. అందుకే, ఖమ్మం నుంచి గెలుపు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఫోక‌స్ అవుతోన్న మహమ్మద్ జావేద్ అంచ‌నా వేస్తున్నారు. మహబూబ్ నగర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు ఒబైదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ 12 ఏళ్ల పదవీకాలంతో అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగాన‌ని చెబుతున్నారు. కర్ణాటకలో బిజెపికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా ఓటు వేయడంతో ముస్లిం ఓట్ల నుండి కాంగ్రెస్ పార్టీ లాభపడింది. ఆ పార్టీ 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఒక ముస్లింను స్పీకర్‌ని చేసి రెండు మంత్రి పదవులు ఇచ్చారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్‌ను కొనసాగిస్తామనే హామీ కూడా పార్టీ ఓట్లను ఏకీకృతం  (Congress Trategy) సహాయపడింది.

Also Read : Congress vs BRS; కాంగ్రెస్ బురద రాజకీయాలు: BRS

నిజామాబాద్‌ నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌ నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి సీటు కోరుతున్నట్లు చెబుతున్నారు. 46 ఏళ్ల నా విధేయతకు ప్రతిఫలం దక్కాలంటున్నారు. 1985, 1994, 2018లో నాకు టిక్కెట్‌ ఇచ్చారు. ఈసారి కూడా ఇవ్వాల‌ని కోరుకంటున్నారు. పాతబస్తీలో మాత్రమే టికెట్‌ ఇవ్వకుండా ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌లో పోటీకి దింపాలని నాంపల్లి అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ అంటున్నారు. జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం ఈ స్థానాల్లో అవకాశం క‌ల్పించాల‌ని ముస్లింలు కోరుతున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో ముస్లింల‌కు ఎక్కువప్రాధాన్యం ఇస్తే రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీ  (Congress Trategy) అంచ‌నా వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం మైనార్టీలు.