Lokpoll Pre-Poll Survey : వార్ వన్ సైడ్ గా కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 69-72 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తేల్చి చెప్పింది

Published By: HashtagU Telugu Desk
Lokpoll

Lokpoll

తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Election Polling) సమయం దగ్గర పడుతుండడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు వరుసగా గెలిచిన బీఆర్‌ఎస్‌ (BRS)..ఈసారి బొక్కబోర్ల పడే అవకాశం ఉందని పలు సర్వేలు ఇప్పటికే చెప్పాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని..కాంగ్రెస్ ప్రకటించిన హామీలు బాగున్నాయి..వారు ఎంత వరకు హామీలు నెరవేరుస్తారో తెలియాలంటే వారు అధికారంలోకి రావాలని ప్రజలు అంటున్నారు. ఇదే విషయాన్ని లోక్‌పోల్ సర్వే (Lokpoll Pre-Poll Survey) చెప్పుకొచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను మంగళవారం సాయంత్రం వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 69-72 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అలాగే అధికార పార్టీ బిఆర్ఎస్ 40 కంటే ఎక్కువ సీట్లు పొందే ఛాన్స్ లేదని, బీజేపీ 2-3 స్థానాల్లో, మజ్లిస్ 5-6 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం నిండుగా ఉందని తెలిపింది. కాంగ్రెస్ కు 43%-46% మేర ఓట్ల షేర్ వస్తుందని, బీఆర్ఎస్ కు 38%-41% మధ్యలో ఉంటుందని పేర్కొన్నది.

అలాగే బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ రెండు చోట్ల విజయం సాదించబోతున్నారని..నల్గొండ, ఖమ్మం , మహబూబాబ్ నగర్ లలో కాంగ్రెస్ క్లిన్ స్వీప్ చేయబోతోందని పోల్ సర్వే తెలిపింది. ఇక గ్రేటర్ లో బిఆర్ఎస్ కేవలం మూడు సీట్లు మాత్రం సాదించబోతుందని..తలసాని , మాగంటి , పద్మ రావు లు మాత్రమే విజయం సాదించబోతున్నారని తెలిపింది. మిగతా స్థానాల్లో ఇతరాలు గెలవబోతున్నారని తెలిపింది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ , కొన్ని స్థానాల్లో బిజెపి విజయం సాదించబోతుందని సర్వే లో పేర్కొంది. ఖమ్మం లో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాదించబోతుందని , రంగారెడ్డి కాంగ్రెస్ 07 , బిఆర్ఎస్ 05 , బిజెపి 2 స్థానాల్లో గెలవబోతుందని తేల్చింది. వరంగల్ 9 స్థానాల్లో కాంగ్రెస్ , నల్గొండ లో 12 కు 12 కాంగ్రెస్ గెలవబోతుందని తెలిపింది.

ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గరిష్టంగా 134 స్థానాలు వస్తాయని లోక్‌పోల్ అంచనా వేసింది. అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ 65 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఆ అంచనాకు తగినట్లుగానే ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటక ఒపీనియన్ పోల్ ఫలితాలను వారం రోజుల ముందుగానే లోక్‌పోల్ వెల్లడించింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ పది రోజుల ముందుగానే అంచనా వేయడంతో అంత ఆసక్తి కనపరుస్తుంది. లోక్ పోల్ నివేదిక కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ ఇస్తుంది. ఇప్పటికే పుంజుకున్న కాంగ్రెస్ కు మరింత జవసత్వాలు నింపేలా ఉంది. చూద్దాం ఈ పోల్ సర్వే ఎంతవరకు నిజం అవుతుందో..

Read Also : KTR: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వైబ్ సైట్ ను ప్రారంభించిన కేటీఆర్

  Last Updated: 22 Nov 2023, 12:06 PM IST