Site icon HashtagU Telugu

Congress to BRS : బీఆర్ఎస్ లోకి జ‌గ్గారెడ్డి?  కాంగ్రెస్ కు జ‌ల‌క్!

Congress to BRS

Jaggareddy 1

Congress to BRS : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి జయప్రకాష్ ‘జగ్గా’ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటు అనుచ‌రులు కొంద‌రు నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతార‌ని  (Congress to BRS) స‌మాచారం. ప్ర‌త్యేకించి సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డిలతో పాటు జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కునిగా జ‌గ్గారెడ్డికి గుర్తింపు ఉంది. ఆయ‌న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే, ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ ఇటీవ‌ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌కు విరుద్ధంగా ఏఐసీసీ ఆయ‌న్ను కొన‌సాగిస్తోంది.

ఎమ్మెల్యే టి జయప్రకాష్  రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై (Congress to BRS)

తొలుత సంగారెడ్డిలో బీజేపీ తరుపున మున్సిపల్ కౌన్సిలర్‌గా జ‌గ్గారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నుంచి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌రువాత టీఆర్‌ఎస్‌తో విభేదించి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌ 2009, 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌గ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా రేవంత్ వ‌ర్గీయులు గంద‌గోళంగా పోస్ట్ లు పెట్ట‌డ‌డంపై ప‌లుమార్లు విరుచుకుప‌డ్డారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని (Congress to BRS) వ్య‌తిరేకించారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా రేవంత్ వ‌ర్గీయులు గంద‌గోళంగా పోస్ట్ లు

ఇటీవ‌ల పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్నారు. కానీ ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. 2021 జూన్‌లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి జ‌గ్గారెడ్డి కలత చెందుతున్నారు. సీనియర్ సభ్యులను పక్కకు నెట్టి, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడ‌ని రేవంత్ రెడ్డి (Congress to BRS) ప‌లుమార్లు మీడియాముఖంగా తిర‌గ‌బ‌డ్డారు. రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకోకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి నెలకొంది. కొన్ని నెలల క్రితం రేవంత్ అనుచరులను మూర్ఖులని జ‌గ్గారెడ్డి సంభోదించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌పై ట్రోల్ చేయడం కార‌ణంగా ఆగ్రహం చెందారు. “రేవంత్ రెడ్డి మద్దతుదారుల నుండి వచ్చే ఇబ్బందులను నియంత్రించాలి, మేము ఆరుగురు (ఎమ్మెల్యేలు), మేము అసెంబ్లీలో కూర్చుని ప్రజల సమస్యలపై పోరాడాలా లేదా ఈ తెలివితక్కువ రేవంత్ అనుచరుల పోస్ట్‌లపై కూర్చుని వ్యాఖ్యానించాలా?ష‌ అంటూ జ‌గ్గారెడ్డి ఆవేదన చెందారు.

Also Read : Telangana Congress : కేటీఆర్ ఫై ఎంపీ కోమటిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

కేవ‌లం జ‌గ్గారెడ్డి మాత్ర‌మే కాదు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే జానారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ‌తారని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఈ ప్ర‌చారాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్లు ఖండించారు. మైండ్ ఆడుతూ బీఆర్ఎస్ చేస్తోన్న ప్ర‌చారంగా కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2019లో 12 మంది బీఆర్‌ఎస్‌కు ఫిరాయించిన తర్వాత మిగిలిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు కూడా ఉండడం గమనార్హం.

Also Read : MLA Jaggareddy : జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు

ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. అతని విషయంలో, పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం రెండు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో బీజేపీ కూడా చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాల‌కు తెర‌లేపారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టుల‌ను పెడుతూ ఆయ‌న ప‌ర్స‌నాలిటీని దెబ్బ‌తీసే కుట్ర కాంగ్రెస్ లోని ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గీయులు చేయ‌డం జ‌రిగింది. దానిపై పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు. విచార‌ణ త‌రువాత రేవంత్ వ‌ర్గీయులు సోష‌ల్ మీడియా వేదిక‌గా దుష్ప్ర‌చారం చేశార‌ని తేలింది. ఆ మేర‌కు అధిష్టానంకు కూడా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయిన‌ప్ప‌టికీ అధిష్టానం పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో సీనియ‌ర్లు ఎవ‌రిదోవ వాళ్లు చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది.