Judson Bakka : కాంగ్రెస్ పార్టీ నుంచి బక్క జడ్సన్ బహిష్కరణ..

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి ప్రకటించారు

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 01:31 PM IST

టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ (Judson Bakka)పై కాంగ్రెస్‌ (Congress) పార్టీ బహిష్కరణ (Congress Suspend ) వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి ప్రకటించారు. పీసీసీ మాజీ సెక్రటరీగా, ఏఐసీసీ మాజీ సభ్యులుగా బక్క జడ్సన్ పనిచేశారు. ఆయన బీఆరెస్ పదేళ్ల పాలనలో జరిగిన అనేక అవకతవకలను వెలుగులోకి తేవడం చురుగ్గా పనిచేశారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డితో నెలకొన్న విబేధాల నేపథ్యంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా పార్టీ అధికారంలోకి వచ్చాకా సస్పెండ్ గురికావడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం రేవంత్‌రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని తాజాగా బక్క జడ్సన్‌ ఆరోపించారు. నాలుగు లక్షల సిమ్‌ కార్డుల కొనుగోళ్ల వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారని, విద్యాసాగర్‌రెడ్డి అనే వ్యక్తి నాలుగు లక్షల సిమ్‌ కార్డులు కొన్నారని నగర సీపీకి ఫిర్యాదు చేయగానే, నాకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన సస్పెండ్‌కు గురయ్యారు. దీనిపై ‘ఎక్స్‌’ వేదికగా జడ్సన్‌ స్పందిస్తూ.. “1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు హైకమాండ్ ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను మింగేసే తోడేలుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ బాధ్యతలను అప్పజెప్పింది. ఎట్టకేలకు నన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సరైన గుర్తింపునిచ్చారు” అంటూ జడ్సన్ ట్వీట్ చేశారు. కాగా.. ఆయన చేసిన ట్వీట్‌కు రేవంత్ రెడ్డి వీడియోను కూడా జత చేశారు జడ్సన్. ప్రస్తుతం.. ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Read Also : Shashi Tharoor : మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న.. శశిథరూర్ ఆసక్తికర సమాధానం!