Congress ‘Special Manifesto’ : తెలంగాణకు కాంగ్రెస్ ‘స్పెషల్ మేనిఫెస్టో’..

పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ 'స్పెషల్ మేనిఫెస్టో' ను ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 01:41 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections ) ఆరు గ్యారెంటీ హామీలు (Six Guarantees) ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Polls) సమయం దగ్గర పడుతున్న వేళ ‘స్పెషల్ మేనిఫెస్టో’ (‘Special Manifesto’) ను ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. రేపు (మే 3) ఉదయం 11 గంటలకు తెలంగాణ స్పెషల్ మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనున్నారో సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, రహదారులు, రైల్వే లైన్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు కనపరుస్తుంది. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే పలు గ్యారెంటీలను అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంచుకుంది. అదే విషయాన్నీ తమ ప్రచారంలో చెప్పుకుంటూ..మిగతా హామీలను ఆగస్టు 15 లోపు నెరవేరుస్తామని, లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా మిగతా హామీలను నెరవేర్చలేకపోయామని చెపుతూ వస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలన్నీ నెరవేరుస్తామని..నిరుద్యోగులకు ఉద్యోగ హామీలు ఇస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే మిగతా పార్టీల నేతలను సైతం పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ రాష్ట్రంలో తమ బలం పెంచుకుంటూ వెళ్తుంది. 17 స్థానాల్లో కనీసం 14 స్థానాల్లో గెలిచి తీరాలని రేవంత్ సన్నాహాలు చేస్తున్నాడు. మరి రేపు విడుదల చేయబోయే ప్రత్యేక మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో..ఎలాంటి హామీలు కురిపించబోతున్నారో చూడాలి.

Read Also : AP Poll : నగరిలో రోజాకు టికెట్ ఇవ్వొద్దన్నా నేతపై వేటు