Hyderabad: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లపై కన్నేసిన కాంగ్రెస్

హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

 

Hyderabad: హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగానే కార్పొరేటర్లకు కాంగ్రెస్ వల విసురుతోంది. బీఆర్‌ఎస్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే . మరోవైపు మరో డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా మైనంపల్లి శ్రీలత శోభన్‌రెడ్డికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది . గత కొంత కాలంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌తో శోభన్‌రెడ్డికి విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కార్పొరేటర్లతో కేటీఆర్ నిర్వహించిన భేటీకి సైలెంట్ అయ్యారని సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా ఆ పార్టీ నేతల తీరు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

గత కొంత కాలంగా శోభన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కీలక నేతలు తనకు 2 నిమిషాల అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని శోభన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే శోభన్ పలు సందర్భాల్లో పార్టీ నేతలు తనను అవమానిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుండగా అదే అసహనంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు శోభన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది .

గతంలో నగరంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న సంగతి గుర్తుండే ఉంటుంది. గతంలో సికింద్రాబాద్ లోక్‌సభతో పాటు హైదరాబాద్‌లో కూడా గెలిచిన సందర్భాలున్నాయి. అయితే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి పార్లమెంట్‌లో మాత్రమే కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది.

Also Read: Bonthu Rammohan : కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్..?

Follow us