BJP Workshop : బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన : కిషన్‌రెడ్డి

పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Congress rule similar to BRS rule: Kishan Reddy

Congress rule similar to BRS rule: Kishan Reddy

Kishan Reddy : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని అన్నారు. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కోనసాగుతోందని అన్నారు. పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు.

ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈరోజు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కానీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ ప్రజలకు విసిగిపోయి ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. అంతేకాక.. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గాలికొదిలి రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు.

Read Also: Kailash Gahlot : బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్‌

  Last Updated: 18 Nov 2024, 01:21 PM IST