Site icon HashtagU Telugu

Congress List: కాంగ్రెస్‌ మరో జాబితా విడుదల.. పోటీలో ఎవరంటే..?

Congress Election Committee

Congress released another list

 

Congress MP Candidates  List : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు(Five parliamentary constituencies) అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి (ఎస్సీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి స్థానానికి సునీత మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి దానం నాగేందర్‌, చేవేళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ నుంచి మల్లు రవి పేర్లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. తొలి జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, నల్గొండ నుంచి కుందూర్‌ రఘువీర్‌, మహబూబ్‌నగర్‌ చల్లా వంశీచందర్‌, మహబూబాబాద్‌ (ఎస్టీ) బలరాం నాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలో 17 పార్లమెంట్‌ స్థానాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్‌ తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, వరంగల్‌, భువనగిరి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

read also: Kejriwal Arrest : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం